దేశ యువతపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తి కర కామెంట్స్ చేశారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన స్వేచ్ఛా ఇతిహాసమే భారత స్వరాజ్య సంగ్రామ చరిత్ర అని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలను యువత అధ్యయనం చేయాలని వెల్లడించారు. వివక్షలకు తావులేని నవ భారత నిర్మాణమే స్వరాజ్య సమరయోధులకు అందించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.
పాండ్రంగిలోని శ్రీ అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని సందర్శించారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. శ్రీ అల్లూరి ఆత్మవిశ్వాసం, తెగువ, దేశభక్తి యువతకు ఆదర్శం కావాలని పిలుపు ఇచ్చారు వెంకయ్య నాయుడు.
బర్లపేటలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైన రూపాకుల దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హరిజనులకు ఆలయ ప్రవేశం, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పుసత్యాగ్రహం ఉద్యమాల్లో రూపాకుల దంపతుల త్యాగాల ఆదర్శంగా తీసుకోవాలని సూచనలు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలన్నారు వెంకయ్య నాయుడు.