మైనర్ ప్రేమజంట ఆత్మహత్య..ప్రేమికుల వీడియో వైరల్

-

పెద్దపెల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.ఓ మైనర్ ప్రేమ జంటఓ మైనర్ ప్రేమ జంట వారి కులాలు వేరు కావడం వల్ల పెద్దలు పెళ్ళికి నిరాకరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామం లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.సుల్తానాబాద్ మండలం కనుకులలో శివ, సుష్మిత అనే ఇద్దరు మైనర్లు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు.ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా తెలిసింది.దీంతో ఇరు కుటుంబాల సభ్యులు వారిని మందలించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారి కులాలు వేరు కావడం, వారిద్దరూ మైనర్లు అందరిలో పెళ్లి చేయలేమని తేల్చి చెప్పారు.

దీంతో మనస్తాపం చెందిన ప్రేమ జంట చావే మార్గమని నిశ్చయించుకొని నిన్న ప్రియుడు శివ పురుగుల మందు తాగి చికిత్సపొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో మృత్యువాత పడ్డాడు.ప్రియుని మరణవార్త తెలుసుకుని మనస్తాపం చెందిన ప్రియురాలు సుష్మిత నేడు తెల్లవారుజామున గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గతంలో వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించడంతో ప్రేమ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలిసింది.మృతిచెందిన ప్రేమికుల ఫైల్ ఫోటోలతో వీడియో తయారు చేసి గ్రామస్తులు సోషల్ మీడియా గ్రూప్ లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version