ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఏపీకి రూ. 2 లక్షల కోట్లలకు పైగా పెట్టుబడులు – విడదల రజిని

-

నేటి నుంచి విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి విడదల రజిని గారు మీడియా సమావేశంలో వెల్లడించారు .

ఈసమ్మిట్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి రజని గారు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సత్తాను చాటే వేదిక ఇదేనన్నారు .. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటి నుంచి కార్యాచరణ ఆ క్రమంలోనే కొనసాగుతోందని మంత్రి రజని గారు తెలిపారు. రాష్ట్రంలో సరికొత్త వ్యాపారరంగాలు, కొత్త పరిశ్రమల స్థాపనకు ఈ సమ్మిట్ సానుకూల స్వాగత ద్వారాలు తెరుస్తుందని చెప్పారు. ప్రపంచంలో 40 దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని , ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు వారంతా ఉత్సాహ భరితంగా ముందుకు రావడం తమ ప్రభుత్వానికి గర్వకారణంగా నిలుస్తుందన్నారు.

వేలాది మంది పెట్టుబడి దారులు, విధాన రూపకర్తల పరిశ్రమలు, వ్యాపార రంగాల ఆవిర్భావానికి ఈ సమ్మిట్ తెర తీయబోతోందని మంత్రి రజిని గారు పేర్కొన్నారు .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విశాఖకు ఉన్న సహజ వనరులే పారిశ్రామిక వికాసానికి ఆభరణాలని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగానే వైద్యరంగా నికి అపార పెట్టుబడులు రాబోతున్నాయని, ఇందుకోసం పీపీపీ మాడ్యూల్ ను అనుసరిస్తామని ఆమె తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రూ. 2 లక్షల కోట్లలకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ వంటి గ్లోబల్ ఈవెంట్లతో రాబోయే రెండేళ్లలో లక్షలాది మంది ఐటీ , హెల్త్‌కేర్, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులుగా అందుబాటులోకి రానున్నారని మంత్రి రజని తెలిపారు. ఇప్పటికే ఈ సమ్మిట్ కు 14 వేల రిజిస్ట్రేషన్లు జరగడమే దీనికి నిదర్శనమని ఆమె తెలిపారు..

టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఆయనకు వత్తాసు పలికే ఒకటిరెండు పార్టీ లు ఈసమ్మిట్ గురించి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని , బాబు హయాంలో ఫేక్ ఎంఓయూలు కుదుర్చుకున్నారని మంత్రి గారు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈసమ్మిట్స్ ను పారదర్శకంగా నిర్వహించాలన్న సూచన మేరకు ఆ పద్ధతిలోనే సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా చేసుకుని జీఐఎస్ నిర్వహణ జరుగుతుందన్నారు. ఈ రెండు రోజుల సమ్మిట్ లో లక్షలకోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తామని మంత్రి రజిని గారు వివరించారు. ఈసమ్మిట్ విశాఖపట్నానికి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల పారిశ్రామిక వికాసానికి దోహదపడుతుందన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news