మృత దేహాలతో వ్యాపారం చేసేవారిని వదిలే ప్రసక్తే లేదని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రుల వద్ద మహా ప్రస్థానం వాహనాలను రాత్రిపూట కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అలాగే, మృతదేహాలను తరలించేందుకు ప్రీ పెయిడ్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు మంత్రి విడదల రజని.
రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చాము. ఆర్‌ఎంఓను సస్పెండ్ చేశాం. ఈ అమానవీయ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిమాండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో మృతదేహాల తరలింపునకు ప్రైవేటు అంబులెన్స్‌లపై మానిటరింగ్ కోసం రవాణా, పోలీసు, రెవెన్యూ, వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారన్నారు రజినీ.