అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు లక్షా 50 వేల మంది వస్తారు – విజయసాయిరెడ్డి

-

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు లక్షా 50 వేల మంది వస్తారన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అంబేద్కర్ స్మృతి వనం, విగ్రహం ఆవిష్కరణను పెద్ద ఎత్తున చేపట్టనుంది వైసీపీ. ఈ తరుణంలోనే.. సామాజిక సమతా సంకల్పం సభ, అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం పోస్టర్ ను ఆవిష్కరించారు మంత్రులు, విజయసాయిరెడ్డి, ఇతర నేతలు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ…అంబేద్కర్ కన్న కలలను సాకారం చేస్తున్నారు సీఎం జగన్….అణగారిన వర్గాలకు నిలువెత్తు రూపం అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ ఆశయాలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారని జగన్ పై ప్రశంసలు కురించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జగన్ చరిత్రలో నిలిచిపోతారు…అంటరానితన పరిస్థితుల నుండి సమాన అవకాశాలు సాధించే పరిస్థితుల వరకు వచ్చామన్నారు. 400 కోట్లకు పైగా ఖర్చు చేసి రూపొందించిన సమతా న్యాయ శిల్పాన్ని సీఎం జగన్ ఎల్లుండి ఆవిష్కరించనున్నారు…లక్షా 50 వేల మందికి పైగా హాజరు అవుతారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని చెప్పారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news