RCB : ప్రభాస్‌ కు బెంగళూరు స్పెషల్ గిఫ్ట్

-

RCB : ప్రభాస్‌ కు బెంగళూరు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. స్టార్ హీరో ప్రభాస్ కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ఆర్సిబి జెర్సీని ప్రభాస్ కు అందించి తమకు ఉన్న అభిమానాన్ని పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట్లో షేక్ చేస్తోంది.

RCB Franchise Gifts Team Jersey To Prabhas And Salaar Team

వచ్చే సీజన్లో ప్రభాస్ ఆర్సిబికి సపోర్ట్ చేయాలని, ఆర్సిబి జెర్సీ వేసుకుని ఫోటో షేర్ చేయాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ కు గిఫ్ట్ ఇవ్వడం బాగుందని ఆర్సిబిని మరి కొందరు కొనియాడుతున్నారు.

ఇక ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సలార్ ప్రభాస్ అభిమానులను చాలా ఏళ్ళ తరువాత కాలర్ ఎగరేసేలా చేసింది. రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమా పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుందని నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. ‘సలార్ : సీజ్ ఫైర్’ సినిమాను థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్ ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని టాక్ వినిపించింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news