కుక్క పని కుక్క, గాడిద పని గాడిదే చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. తన ఎంపీలు ముగ్గురిని బీజేపీలోకి పంపాడు. చెలిమికి సై అని సైగలు చేశాడు. ప్రాధేయపడ్డాడు. కమలానికి కన్ను కొడుతూనే రాహుల్ పై మనసు పారేసుకున్నాడంటూ ఎద్దేవా చేశారు. విలువల్లేని రాజకీయాలు కొత్తేమీ కాదు బాబుకి. ఇందిర మెప్పు కోసం మామగారి పైనే పోటీ చేస్తానని బీరాలు పలికి ‘ఆఖరికి’ ఆయన కాళ్లు పట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుక్క పని కుక్క, గాడిద పని గాడిదే చేయాలి. గార్డబం జాగిలంలా భ్రమపడితే పరిస్థితి ఏమవుతుందో చెప్పనక్కర్లేదని చురకలు అంటించారు. తిరస్కారాలు ఎదురైనా ‘పిచ్చి’ ముదిరిన స్వార్థజీవులు మారరు. ‘చిన్న సమూహం’ ప్రయోజనాల కోసం ఇంకొకరి భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తారు. బలిపశువు దొరకాలి అంతే! అంటూ ఫైర్ అయ్యారు విజయసాయి. ఎల్లో మీడియా ముఖ్యులు తమ వ్యాపార విబేధాలను పక్కనపెట్టి ఏకమయ్యారు. రాధాకృష్ణ, TV5 నాయుడు, CVR సివి రావు, స్వయం ప్రకటిత మీడియా కింగ్ రవిప్రకాశ్ అర్థరాత్రి తాజ్ కృష్ణాలో రాహుల్ ను కలిశారని… ప్రధాని మోదీని ఎలా దింపొచ్చో క్షుద్ర వ్యూహాలతో బాబు కోసం ఈ దళారీ వ్యవహారాన్ని నడిపారంటూ ఎద్దేవా చేశారు.