టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నెంబర్-8లోని విశ్వక్ సేన్ ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు.. బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు.
విశ్వక్ సేన్ సోదరి వన్మయి రూమ్‌లోని ఆల్మారాలో బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.