సాయిరెడ్డి ట్వీటిన “బాబు – బషీర్ బాగ్” దారుణం గుర్తుందా?

అది 2000 సంవత్సరం ఆగస్టు నెల 28 వ తేదీ.. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ చౌరస్తా అట్టుడికిన రోజు… అమాయకులపై పోలీసు కాల్పులతో దద్ధరిల్లిన సమయం.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన దారుణ సంఘటన ఇది! నాడు విద్యుత్ రేట్లను విపరీతంగా పెంచడానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం అది. ఈ పోరాటంలో ముగ్గురి ప్రాణాలు గాళ్లో కలిసిపోగా… వందల మంది రక్తం రోడ్లపై చిమ్మిది!! తాజాగా ఈ వ్యవహారాన్ని గుర్తుచేశారు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి!

ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీలపై చంద్రబాబు ధర్నాలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో… “తన పాలనలో అనేకసార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చంద్రబాబు.. ఇప్పుడు ధర్నాలు చేస్తామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. విద్యుత్తు ఛార్జిల పెంపుకు నిరసనగా బషీర్ బాగ్ లో ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు బలిగొన్న చరిత్ర నీది. 20 ఏళ్లైనా ఎవరూ మర్చిపోలేదు” అని ట్విట్టర్ లో స్పందించారు! దీంతో మరోసారి నాడు బషీర్ బాగ్ లో బాబు చేసిన అరాచకంపై సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది!

ఈ బషీర్ బాగ్ ఆందోలన.. వామపక్షాల ఆధ్వర్వంలో దశలవారీగా ఉద్యమం వూపందుకుంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమానికి మద్దతు తెలిపి, అందులో పాల్గొంది. ఇందులో భాగంగా విద్యుత్తు చార్జీల పెంపునకు నిరసనగా ఆగస్టు 28 చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. దాంతో బషీర్ బాగ్ వద్ద ముళ్ల కంచెలు వేసి భారీగా పోలీసులను మోహరించారు.. అనంతరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో విష్ణువర్ధన్‌, బాలస్వామి, రామకృష్ణ అనే ముగ్గురు వ్యక్తులు మరణించారు! ఇది బాబు రాజకీయ జీవితంలో అత్యంత దారుణమైన మచ్చ అనే చెప్పాలి! ఆ సమయంలో కాల్పులు జరపడాన్ని రాష్ట్రం మొత్తం వ్యతిరేకించింది.. ఖండించింది!

అధికారంలో ఉన్నప్పుడు బాబు ప్రజలను ఎంత చులకనగా చూస్తారు.. ఎంత నియంతృత్వ దోరణితో ప్రవర్తిస్తారు అనేదానికి బషీర్ బాగ్ సంఘటన మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే! నేడు ఏపీలో పెరిగిన విద్యుత్ ధరలపై బాబు… ఇంట్లో కూర్చుని దీక్ష చేస్తాను అనడంపై సాయిరెడ్డి ఈ విషయాన్ని గ్రుతుకు తెచ్చారు! నిజమే కదా… చరిత్ర అనేది చింపేస్తే చిరిగిపోయేది కాదు, చెరిపేస్తే చెరిగిపోయేది కాదు!!