త్వరలో అత్యంత కీలకమైన కేసీఆర్ – జగన్ ఐదో మీటింగ్!

-

జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ కేసీఆర్ తో సన్నిహితంగానే ఉంటున్న సంగతి తెలిసిందే. అంతరాష్ట్ర సమస్యలు ఏమి వచ్చినా వీరిద్దరూ ఏమాత్రం ఆవేశకావేశాలకు పోకుండా కూర్చుని మాట్లాడుకుంటూ.. రెండు తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు! ఈ క్రమంలో తాజాగా పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబరు 203 చాలా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులూ సంయమనంగానే ఉన్నా… తెలంగాణ ప్రతిపక్షాలు ఒకింత హడావిడి చేశాయి తప్ప ఏపీలో మాత్రం ప్రతిపక్షాలు అస్సలు స్పందించలేదు!


ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారంపై ఎవరికీ అవకాశం ఇవ్వొద్దనో లేక అంతరాష్ట్ర సమస్యల విషయంలో నేరుగా మాట్లాడుకుంటేనే సులువైన పరిష్కారాలు దొరుకుతాయనో కానీ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ – ఏపీ ముఖ్యమంత్రి జగన్ లు మరోసారి కలవబోతున్నారట! లాక్ డౌన్ అనంతర పరిస్థితులపై చర్చించుకోవడంతోపాటు… అతి ముఖ్యంగా నదీజలాల వ్యవహారాలాపైనే ఈ భేటీ ప్రధానంగా సాగబోతోందని తెలుస్తోంది! ఈ మేరకు లాక్ డౌన్ ముగిసిన తర్వాత వీరి సమావేశం ఉంటుందని ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది! అదే జరిగి అంతా అనుకూలంగా జరిగితే మాత్రం… రాయలసీమ జిల్లాలకు చాలా మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

కాగా… తొలిసారిగా అధికారుల బృందంతో కలిసి జూన్ 28న ప్రగతిభవన్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ అవ్వగా… అనంతరం ఆగస్టు1న రెండో సారి, అధికారుల బృందంతో కలిసి సెప్టెంబర్ 23న మూడోసారి.. ఈ ఏడాది జనవరి 13న నాలుగోసారి భేటీ అయిన సంగతి తెలిసిందే.ఈ సమావేశాలలో ప్రధానంగా విభజన సమస్యలు కొన్ని కొలిక్కితేవడంతో పాటుగా గోదావరి-కృష్ణా అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టులపైనే ప్రధానంగా చర్చించారు!

Read more RELATED
Recommended to you

Latest news