వైఎస్సార్సీపీ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి సిట్ విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిట్ విచారణ గురించి చెప్పారు. విచారణలో అధికారులు కిక్‌బేగ్స్ గురించి అడిగారని.. తనకు తెలియదని చెప్పానని తెలిపారు. రెండు కంపెనీలకు సిఫారసు చేశానని చెప్పానని.. ఒకరికి రూ.60 కోట్లు, మరొకరికి రూ.40 కోట్లు ఇచ్చారని చెప్పానని వెల్లడించారు. రుణం మాత్రమే ఇప్పించానని.. నిధుల వినియోగం గురించి తెలియదని చెప్పానని పేర్కొన్నారు.
మరోవైపు ఈ కేసులో ఈనెల 15వ తేదీన సిట్ అధికారులు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డికి నోటీసులు అందించారు. 18వ తేదీన విచారణకు హాజరు కావాలని పేర్కొనగా.. 17వ తేదీన విచారణకు వస్తానని ఆయన సిట్ కు సమాచారం అందించారు. కానీ గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం రోజున విచచారణకు హాజరయ్యారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డేనని ఇప్పటికే విజయసాయిరెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.