ఫేక్ లెటర్లు తయారు చేయించడంలో కేటీఆర్ దిట్ట : ఎంపీ మల్లు రవి

-

తెలంగాణ సీఎం పేరుతో ఎవరైనా ఫేక్ లెటర్లు తయారు చేస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవీ ఇవ్వొద్దని.. సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి రాసినట్టు ఓ లెటర్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అయితే అదంతా అబద్దం అని.. రేవంత్ రెడ్డి పేరుతో కావాలని కుట్ర చేస్తున్నరని మల్లు రవి మండిపడ్డారు. సీఎం కి మక్తల్ ఎమ్మెల్యే కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు అలా చేస్తారని వివరించారు.

ఆ ఫేక్ లెటర్ ను కేటీఆర్ కావాలనే వారి నేతలతో సర్క్యులేట్ చేయిస్తున్నారని.. ఇలాంటి ఫేక్ లెటర్లు తయారు చేయడంలో కేటీఆర్ దిట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తప్పకుండా విచారణ జరిపిస్తామని.. తప్పుడు లెటర్లు సృష్టించిన వారిని వదిలేది లేదని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news