తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. జపాన్ పర్యటనలో భాగంగా ఇవాళ టోక్యోలోని హోటల్ ఇంపీరియల్ లో జరిగిన ఇండియా-జపాన్ ఎకానమిక్ పార్ట్ నర్ షిప్ రోడ్డు షో లో రాష్ట్ర అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను వివరించింది. వివిద రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ రోడ్డు షోలో సీఎం మాట్లాడారు.
జపాన్ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. దేశంలోనే కొత్త రాష్ట్రం.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. జపాన్ ని ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్.. ఈరోజు తెలంగాణ జపాన్ లో ఉదయిస్తోందని పేర్కొన్నారు.