ఎన్టీఆర్ సినిమాలు రోజూ ‘ఈటీవీ’లో వేస్తున్నాడు – విజయసాయి

-

ఎన్టీఆర్ సినిమాలు రోజూ ‘ఈటీవీ’లో వేస్తున్నాడని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. ఎవరిని వెన్నుపోటు పొడిచి చంపేశారో అదే ఎన్టీఆర్ సినిమాలు రోజూ ‘ఈటీవీ’లో వేస్తూ వెన్నుపోటుదారుడిని నిలబెట్టటానికి మరో వెన్నుపోటుదారుడి ప్రయత్నం అంటూ ఈటీవీ రామోజీ రావును ఉద్దేశించి.. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. బాగుంది! చంపటానికైన, పేరు వాడుకోవటానికైనా మేమే హక్కుదారులం అన్నట్లుంది వీళ్ళ వ్యవహారం అంటూ మండిపడ్డారు.

vijayasai vs ramoji

ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అని నారా లోకేష్‌ పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆగ్రహించారు. నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారు నారా లోకేశ్ గారు… గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు. ఛాలెంజికి కూడా ఒక స్థాయి ఉండాలన్నారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news