బెజవాడ ఫ్లైఓవర్ పై వెళ్తున్నారా…?

బెజవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ వద్దగా ప్రయాణం చేసే వారికి విజయవాడ పోలీసులు కొన్ని సూచనలు చేసారు. కనక దుర్గమ్మ ఫ్లైఓవర్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి విద్యాధరపురం వైపు వెళ్లే వాహనాల దారి మళ్లిస్తున్నారు. కాళేశ్వరరావు మార్కెట్, చిట్టినగర్ మీదుగా విద్యాధరపురం వెళ్లాలని పోలీసులు సూచించారు. కార్లు, లారీలు, బస్సులు మాత్రమే మళ్ళిస్తున్నారు.

ద్విచక్ర వాహనదారులకు మాత్రం అనుమతి ఇచ్చారు విజయవాడ పోలీసులు. ఈ వాహనాల మళ్లింపు వచ్చే యేడాది ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఉంటుంది అని విజయవాడ పోలీసులు పేర్కొన్నారు. ప్రజలు కూడా పరిస్థితి అర్దం చేసుకుని సహకరించాలని సీపీ బత్తిన శ్రీనివాసులు విజ్ఞప్తి చేసారు. కాగా ఇటీవల విజయవాడ ఫ్లై ఓవర్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.