ప్రధాని మోడీతో చంద్రబాబు మాటమంతి..ఫోటోలు షేర్‌ చేసిన సాయిరెడ్డి

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాక్యలు చేశారు విజయసాయిరెడ్డి. ప్రధాని మోడీని చంద్రబాబు కలవడంపై సెటైర్లు పేల్చారు విజయసాయి. బతిమాలగా…బతిమాలగా ఐదేళ్ల తర్వాత చంద్రబాబును ప్రధాని మోదీ పలకరిస్తేనే పచ్చ కుల మీడియా పులకరించి పోయింది. ఊహాజనిత కథనాలతో రోజంతా రచ్చ రచ్చ చేసిందని..ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు స్వయంప్రకాశం ఎలాగూ లేదు. వ్యక్తిత్వం కూడా లేదని ఢిల్లీ పర్యటనతో అర్థమైందని చురకలు అంటించారు. బీజేపీకి దగ్గర కావాలని ఆరాటపడుతూ బీజేపీ తనకు దగ్గరవుతున్నట్లు నటిస్తూ, మరోవంక తెరచాటున కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం నాయకుల్ని అపాయింట్‌మెంట్లు ఎందుకు అడిగాడో బాబే చెప్పాలని పేర్కొన్నారు.

ఢిల్లీ వెళ్లినా చంద్రబాబును ఆల్జీమర్స్ వదల్లేదు. వాజ్‌పేయికి స్వర్ణచతుర్భుజి ప్లాన్‌ చెప్పి, బిల్ గేట్స్‌కు కంప్యూటర్ నేర్పి, ఐటీని స్థాపించి, సత్య నాదెళ్ళకు ఓనమాలు నేర్పింది తానే అంటూ జాతీయ మీడియా ముందు స్వీయప్రగల్బాలు ఎందుకో! వరుస ఓటమి తర్వాత కూడా జ్ఞానోదయంకాలేదా చంద్రబాబు? అంటూ మండిపడ్డారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version