వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 18 నుంచి వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మండపాల అనుమతులకు పోలీస్ శాఖ సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టింది. మున్సిపల్, పంచాయతీ, ఫైర్, ఎలక్ట్రిసిటీ, పోలీస్ కార్యాలయాల చుట్టూ నిర్వాహకులు తిరగకుండా సబ్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసింది.
విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం, ఎత్తు, బరువు వివరాలతో దరఖాస్తులు సమర్పిస్తే అన్ని శాఖల అధికారులు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. కాగా, తిరుమలలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులోకి రానుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్లపై తొలిసారి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు పరుగులు పెట్టింది. తిరుపతి రోడ్లపై దీన్ని తిప్పారు.
త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి తెలిపారు. ఏఏ మార్గాల్లో నడపాలి అనేది ఆర్టీసీ అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు. రూ. 2 కోట్లతో బస్సును కొనుగోలు చేయగా… మూడు గంటలు చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు నడవనుంది.