మంకీపాక్స్‌ ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ తయారు చేసిన విశాఖ మెడ్‌టెక్‌

-

ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తున్న మహమ్మారి మంకీపాక్స్. ఇప్పటికే పలు దేశాల్లో ఈ కేసులు భారీగా నమోదయ్యాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఇటీవలే మంకీపాక్స్కు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. మరోవైపు రాష్ట్రాలు కూడా అప్రమత్తమై మంకీపాక్స్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలోని విశాఖ మెడ్టెక్ జోన్ .. మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలి మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్ను తయారు చేసింది.

మెడ్టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్ డీఎక్స్ మంకీ పాక్స్ కెకె ఆర్టీ-పాక్స్ కిట్ రూపొందించింది. ఈ కిట్కి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ అర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించింది. గతంలో మంకీపాక్స్‌గా పిలుచుకున్న ఎంపాక్స్‌గా ఇప్పుడు మళ్లీ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, దాని చుట్టుపక్కల దేశాల్లో ఎంపాక్స్‌ తీవ్రంగా వ్యాపిస్తోంది . ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నట్టు (పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్సర్న్‌) ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version