ఏపీ మంత్రి విశ్వరూప్ సంచలన వాఖ్యలు చేశారు. పవని కళ్యాణ్ సీఎం కావాలని నేను కోరుకుంటున్నా అంటూ ఏపీ మంత్రి విశ్వరూప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవని కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులే కాదు….నేను కోరుకుంటున్నానని చెప్పారు.
సీఎం కావాలంటే పవన్ 175 స్థానాలో పోటి చేసి విజయం సాధించాలని… లేదంటే కనీసం 100 స్థానాల లో అయినా పోటి చేసి 50 సీట్లలో గెలిచి అయినా సీఎం అవ్వడానికి ప్రయత్నం చెయ్యాలని చురకలు అంటించారు ఏపీ మంత్రి విశ్వరూప్.
దేశంలో ఎక్కడా లేనంత అభివృద్ధి జరుగుతోందని… సురక్షా కార్యక్రమం కింద గవర్నెన్స్ ను ప్రజలకు మరింతగా తీసుకుని వెళ్ళే ప్రయత్నం అన్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలు అందని లబ్దిదారులకు కూడా పథకాలు అందించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు విశ్వరూప్. టీడీపీకి ఎప్పుడూ ఇలాంటి ఆలోచనే చేయలేదని.. చిత్తశుద్ధితో ఉండటం వల్లే ఇలాంటి ఆలోచన ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారన్నారు ఏపీ మంత్రి విశ్వరూప్.