విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉక్కు ఉద్యమానికి నేటితో 1000 రోజులు పూర్తి ఐంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా… కేంద్రం దీనిపై ముందుకు అడుగులు వేస్తోంది. కేంద్రం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పక్షాలు, అధికార వైసిపి.. అలాగే విశాఖ ఉక్కు కార్మికులు దీనిపై పోరాటం చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా కార్మికులు ఉక్కు ఉద్యమం పేరుతో నిరసనలు తెలుపుతున్నారు. అయితే విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉక్కు ఉద్యమానికి నేటితో 1000 రోజులు పూర్తి అయింది.ఇక అటు ఇవాళ స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు మద్దతుగా నవంబర్ 8న అంటే ఇవాళ విద్యాసంస్థల బంద్ చేపట్టనున్నట్లు PDSU, AISF, AIYF ప్రకటించాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి ఇవాళ్టి తో వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపట్టనున్నారు.