వాలంటీర్లు వైసీపీ కోసం పని చేయలేదు : కన్నబాబు

-

వాలంటీర్లు వైసీపీ కోసం పని చేయలేదని.. కానీ వారిని ప్రభుత్వం తమ పార్టీ సానుభూతిపరులుగా చూస్తోందని వైసీపీ నేత కన్నబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. తప్పుడు హామీలతో వాలంటీర్లను మభ్య పెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారికి జీతాలు ఎలా ఇచ్చారు. వ్యవస్థే లేకపోతే న్యూస్ పేపర్ కు ఇచ్చే రూ.200 ఎలా రద్దు చేశారని ప్రశ్నించారు కన్నబాబు.

మరో వైపు కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పేది ఒకటి.. ఎన్నికలు ముగిసాక చేసేది మరొకటి అన్నారు. వాలంటీర్ల విషయంలోనే స్పష్టంగా అర్థమవుతుందన్నారు. వాలంటీర్లను మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి అధికారంలోకి వచ్చాక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లకు నెల నెల జీతాలు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. వాలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి పేదలకు సహాయం చేసేవారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్లను వాడుకోవడం లేదు. వారికి వేతనాలు ఇవ్వడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version