రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించింది. దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి చూపించాం అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు చేసి చూపించారు. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకు గ్యాస్, 50 వేల ఉద్యోగాలు లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.
ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా ప్రజల్లోకి తీస్కెళ్లాలి. కాంగ్రెస్ కార్యకర్తలు మన ప్రభుత్వం చేసిన పనులను ఇంటింటికి తీస్కెళ్లాలి. ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజిపి లు ప్రభుత్వంపైన విపరీతంగా దుష్ప్రచారం చెస్తున్నాయి. వాటిని తిప్పికొట్టాలి. అందుకు తగ్గట్టు మన ప్రచారం ఉండాలి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక మందికి కార్పొరేషన్ల పదవులు వచ్చాయి. డీసీసీ అధ్యక్షులకు అందరికి పదవులు వచ్చాయి. అనుబంధ సంఘాల చైర్మన్ లకు పదవులు వచ్చాయి. ఇంకా చాలా పదవులు ఇవ్వాల్సి ఉంది. పార్టీ కోసం పని చేసిన అందరికి పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో పార్టీ అన్ని విధాలుగా గట్టిగా కృషి చేయాలి. మంచి ఫలితాలు రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని టీపీసీసీ అధ్యక్షులు తెలిపారు.