సనాతన ధర్మాన్ని ఎవరు తుడిచిపెట్టలేరని, అలా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలనుకున్న వారే తుడిచిపెట్టుకుపోతారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. ఆయన కారు ఎక్కెందుకు వెళుతుండగా మీడియా ప్రతినిధులు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి..? పని ప్రశ్నించారు.
దీనికి ఆయన ఏక వాక్యంలో.. “వెయిట్ అండ్ సీ” అని సమాధానం ఇచ్చారు. ఏం జరుగుతుందో చూద్దాం అని చెబుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఉదయనిది స్టాలిన్. కాగా గురువారం తిరుపతిలో కల్తీ లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పలువురు విమర్శలు చేయడం మొదలైంది.
సనాతన ధర్మంపై ఉదయనిది స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చారు ఉదయనిది. దీనిపై బీజేపీ సహా పలు రాజకీయ పార్టీల నాయకులు మండిపడ్డారు. ఇక నిన్న తిరుమల లడ్డు వివాదం పై మాట్లాడిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై విమర్శలు చేసే వారిని కూడా టార్గెట్ చేశారు. ఈ సందర్భంలోనే ఆయన తమిళంలో మాట్లాడుతూ ఉదయనిధికి కౌంటర్ ఇచ్చారు.