BREAKUNG: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో డయేరియా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్. ఆళ్లగడ్డ సిహెచ్ సీలో ముగ్గురు, యుపిహెచ్ సీలో నలుగురు చికిత్స పొందుతున్నారన్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్.

పరిస్థితి పూర్తి అదుపులో ఉంది,ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కొత్త కేసులేవీ నమోదు కాలేదన్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్.
అయితే.. ఈ సంఘటనపై స్పందించారు సీఎం చంద్రబాబు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. మరణాలు జరిగిన ప్రాంతంలో ప్రజల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు.