వైసీపీ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమాజంలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు చాలా అవసరమని అన్నారు. ఈ మూడు కొద్ది మంది చేతులలోకి వెళ్లి మిగతా వాళ్ళు దేహి అనే పరిస్థితిలో ఉండకూడదనే ఉద్దేశంతోనే జనసేన పార్టీని స్థాపించామని అన్నారు. తాను పార్టీ నడుపుతూ దెబ్బలు తిన్నాను తప్ప కార్యకర్తల ఆత్మగౌరభానికి ఎక్కడా భంగం వాటిల్లకుండా చూడగలిగానని చెప్పుకొచ్చారు.
డబ్బులు ఖర్చు చేయకుండా అభిమానులు, కార్యకర్తల ప్రేమాభిమానాన్ని జనసేన సొంతం చేసుకోగలుగుతుందన్నారు. ఇప్పుడు అందరి దృష్టి గోదావరి జిల్లాలపైనే పడిందని.. దాని నుండి విముక్తి కల్పించేందుకు గోదావరి జిల్లాల నుండి పోరాటం మొదలు పెట్టానని అన్నారు. ఉభయగోదావరి జిల్లాలలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకూడదనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని తెలిపారు.