ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనంగా మారిన జీవో నెంబర్ 1 పై ఏపీ హైకోర్టు తీర్పుని వెలువరించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై ప్రతిపక్ష పార్టీలు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపైన విచారణ చేసిన హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోను హైకోర్టు కొట్టి వేసింది. అయితే హైకోర్టు తీర్పుపై తాజాగా స్పందించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామన్నారు.
“దేశంలో అంతిమంగా గెలిచేది.. నిలిచేది అత్యున్నతమైన అంబేద్కర్ రాజ్యాంగమే. జగన్ లాంటి నాయకులు వస్తారని నాడే ఊహించి.. భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారు. ప్రజాస్వామ్యమే ఉన్నతమైనదని.. అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి స్పష్టమైంది. ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై గొంతేత్తకుండా చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబర్ 1ని హైకోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం” అని ట్వీట్ చేశారు చంద్రబాబు.
దేశంలో అంతిమంగా గెలిచేది… నిలిచేది అత్యున్నతమైన అంబేద్కర్ రాజ్యాంగమే. జగన్ లాంటి నాయకులు వస్తారని నాడే ఊహించి…భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారు. ప్రజాస్వామ్యమే ఉన్నతమైనదని….అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి… pic.twitter.com/PD184PNDjP
— N Chandrababu Naidu (@ncbn) May 12, 2023