రైతుబంధు వల్లే తెలంగాణలోని బీడు భూముల్లో పంటలు పండుతున్నాయి – నిరంజన్ రెడ్డి

-

వరంగల్: గత ప్రభుత్వాలు అరవై ఏళ్ల పాలనలో ఎన్ని ప్రభుత్వ గోడౌన్స్ నిర్మించారో.. కేవలం తొమ్మిదేళ్లలో అంతకు మించి గోడౌన్ల నిర్మాణం తెలంగాణలో జరిగిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని.. ఎఫ్సీఐ తరపున ఒక్క గోడౌన్ కూడా కట్టలేదన్నారు. రైతు బంధు పథకం వల్లే తెలంగాణలోని ప్రతి బీడు భూమిలో పంటలు పండుతున్నాయన్నారు.

అలాగే భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయన్నారు. దేశంలో అత్యధికంగా ఎకరాకు 20 లక్షలకు మించి ధరలు పలుకుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు నిరంజన్ రెడ్డి. ఐక్యరాజ్య సమితి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు, రైతు బీమాను బెస్ట్ స్కీమ్స్ అని అభినందించిందన్నారు. కానీ దేశ ప్రధానికి, బీజేపీ నేతలకు మాత్రం ఇవి కనిపించడం లేదని మండిపడ్డారు.

తెలంగాణలో జరిగిన పంట నష్టంపై కేంద్రానికి ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందించలేదని ఆరోపించారు. రైతుల పరిస్థితి చూస్తే దుఃఖం వచ్చిందని.. కానీ కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. ఎలాంటి దాన్యం అయిన కొనాల్సిందేనని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నామన్నారు. ప్రతీ ధాన్యపు గింజ కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news