మీ కుటుంబంలో ఇలా జరుగుతుంటే పితృదోషం ఉన్నట్లే

-

కొన్ని రకాల దోషాల వల్ల మనుషుల జీవితాల్లో సంతోషం ఉండదు.. ఎప్పుడూ ఏదో ఆందోళన, చింతచాకాకు వెంటాడుతుంటాయి.. ముఖ్యంగా మన నడవడిక వల్ల తల్లిదండ్రులు కలత చెందినప్పుడు, వారికి సమస్యలు వచ్చినప్పుడు మనం పితృదోషానికి గురవుతాం. ఈరోజుల్లో కూడా ఇలాంటివి అన్నీ ఎవరు నమ్ముతారండీ అనుకుంటారేమో.. హిందూ సంప్రదాయంలో వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. పితృపక్షం సందర్భంగా మన పూర్వీకులు తమ సంతతిని ఆశీర్వదించేందుకు భూలోకానికి వస్తారన్నది భార‌తీయుల‌ నమ్మకం. పూర్వీకులకు కోపం వస్తే ఇంట్లో అశాంతి నెలకొంటుందని విశ్వ‌సిస్తారు. పూర్వీకులు మ‌న‌పై కోపంగా ఉన్నప్పుడు, ఇంట్లో అనేక విధాలుగా విభేదాలు మొదలవుతాయి. మన తల్లిదండ్రులు మనపై కోపంగా ఉన్నప్పుడు లేదా మ‌న‌పై పితృ దోషం ఉన్న‌ప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..

ఇంట్లో గొడవ
పూర్వీకులకు ఇష్టం లేకపోయినా, మన త‌ల్లిదండ్రులు మనపై కోపంగా ఉన్నా ఇంట్లో గొడవలు రావడం సర్వసాధారణం అయిపోతుంది.. కారణం లేకుండానే కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు గొడవ పడ‌తుంటారు. మీకు కూడా ఇలా జ‌రుగుతుంటే దీనికి కారణం పితృ దోషమే అని గుర్తించాలి.

ఆరోగ్య సమస్యలు
పూర్వీకుల కోపం వల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కుటుంబంలో ఎవరో ఒక‌రు నిరంతరం అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఉంటారు. చికిత్స పొందుతూ ఉన్నప్పటికీ, సమస్యలు కొనసాగుతాయి. ఇది పితృ దోషం ఉంద‌ని తెలుసుకోవ‌డానికి ప్రధాన లక్షణం.

పనుల్లో ఆటంకాలు
మీరు ఏదైనా పని చేయాల‌ని త‌ల‌పెడితే అది సగంలోనే ఆగిపోయినా లేదా పనిలో ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు కనిపించినా అది పితృదోష లక్షణం కావచ్చు. పితృ దోషం వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్ప‌డుతాయి. పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆగిపోవడం స‌ర్వ‌ సాధారణంగా మారుతుంది. అంటే పితృ దోషం ఒక వ్యక్తి పురోగతికి సమస్యలను కలిగిస్తుంది.

పెళ్లికి ఆటంకం
మీ కుటుంబంలో ఎవరికైనా వివాహానికి అడ్డంకులు ఎదురైతే, అది పితృ దోషానికి సంకేతం. పితృ దోషం కారణంగా కుటుంబ సభ్యులకు పెళ్లి కాకపోవ‌డం, పెళ్లి త‌ర్వాత‌ వారి బంధంలో సమస్యలు లేదా వివాహం కుదిరిన‌ తర్వాత చెడిపోవ‌డం కూడా పితృ దోష లక్షణాలేన‌ని గుర్తించాలి.

సంతాన‌ సమస్యలు
పితృదోషం కారణంగా కుటుంబంలో పిల్లలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు లేకపోయినా సంతానం కలగకుండా ఉంటే అది పితృ దోషానికి సంకేతం. ఈ సమస్య ఉంటే పండితులను సంప్రదించండి.

Read more RELATED
Recommended to you

Latest news