ఏపీ మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరతాం : పురంధేశ్వరి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణను తప్పని సరిగ్గా కోరుతామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరీ పేర్కొన్నారు. ప్రతి రోజుల మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనాధికాలంగా వైసీపీ నాయకులు జేబుల్లోకి భారీ మొత్తం వెళ్తున్నాయనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు పురంధేశ్వరి. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడారు.


పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని గురువారం తాను తనిఖీ చేయగా.. అక్రమాలు బటయపడ్డట్టు వెల్లడించారు. రూ.1లక్ష వరకు ఆ సమయానికి విక్రయాలు జరిగితే అందులో డిజిటల్ చెల్లింపులు జరిపింది కేవలం రూ.700 మాత్రమేనని తమ పరిశీలనలో తేలిందని వివరించారు పురంధేశ్వరి. అధికార వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని.. కేవలం మద్యం విషయంలో మాత్రమే పలు రంగాల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మద్యం విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలని కోరనున్నట్టుతమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version