అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం – ప్రధాని మోదీ

-

ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పెద్ద అమరిన్ లోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంశ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు.గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్ర న్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి రోజా అలాగే కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, పురందరేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాలువాతో సన్మానించారు.ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ..

అల్లూరి సీతారామరాజు పుట్టిన, పెరిగిన, తిరిగిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ భీమవరం సభలో ప్రకటించారు. లంబసింగిలో అల్లూరి మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. మొగళ్ళు లో ధ్యాన మందిరం, చింతపల్లి పోలీస్ స్టేషన్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖలో ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని, మన్యం జిల్లాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళితే ఎవరూ ఆపలేరని మోడీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version