సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలానికి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ వరద బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునే విధానం పూర్తిగా మార్చేశామని అన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారం రోజులపాటు అధికారులు బాధిత గ్రామాలలోనే ఉంటూ సాయం అందిస్తారని తెలిపారు.
వారం తర్వాత తిరిగి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తానని తెలిపారు. సహాయం అందలేదని ఏ కుటుంబం కూడా చెప్పకూడదని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అధికారులు సరిగ్గా వ్యవహరించకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం వైసిపి ప్రభుత్వంలో లేదని స్పష్టం చేశారు సీఎం జగన్.