వారి పెన్షన్స్ తొలగిస్తాం.. ఏపీ హెల్త్ మినిస్టర్ కీలక వ్యాఖ్యలు!

-

ప్రస్తుతం రాష్ట్రంలో సదరన్ సర్టిఫికెట్ల అంశంలో సర్వే జరుగుతుందని తెలిపారు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారి పెన్షన్స్ తొలగిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు ఎవరైనా ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చారని తెలిస్తే వైద్యులపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అలాగే మాజీ ముఖ్యమంత్రి పై తీవ్ర విమర్శలు చేశారు సత్యకుమార్. జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్.. వైద్య కళాశాలల నిర్మాణానికి 8,840 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. 2,120 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. అందులో కూడా 700 కోట్లు బకాయి పడ్డారని ఆరోపించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి పులివెందులలో ఆసుపత్రి మాత్రమే కట్టారని.. కళాశాలలు కట్టలేదని ఆరోపించారు. కళాశాల నిర్మాణం కాకుండా, వసతులు లేకుండా విద్యా ప్రమాణాలను ఎలా ప్రారంభించాలని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రతి కళాశాల నిర్మాణంలో ఉందని ఎన్ఎంసికి నివేదికలు ఇచ్చారని తెలిపారు. వైద్య విద్య అందించాలంటే ప్రమాణాలు ఉంటాయని.. అవి పాటించకుండా చేస్తే ప్రజల ప్రాణాలతో ఆడుకున్నట్లేనని అన్నారు సత్యకుమార్. వైద్య విద్య కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు దీనిపై అవగాహన చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 12 కళాశాలలలో రాబోయే ఏడాదికి విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news