తెలుగు రాష్ట్రాల్లో అన్ని లోక్ సభ స్థానాల్లో గెలుస్తాం..ఆ సీటు తప్ప: కే ఏ పాల్

వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు కే ఏ పాల్. హైదరాబాద్ లోక్ సభ మినహా.. మిగిలిన అన్ని పార్లమెంటు స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా దక్షిణాదితోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని అమిత్ షా కి చెప్పినట్లు తెలిపారు. తమ పార్టీ పోటీ ని అమిత్ షా స్వాగతించారని అన్నారు. ఓటు బ్యాంకు లేని పవన్ కళ్యాణ్ వెంట ఎందుకు పడుతున్నారని, అమిత్ షాను అడిగానని… అయితే పవన్ కళ్యాణే తమ వెంట పడుతున్నారని ఆయన చెప్పారని కేఏపాల్ తెలిపారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పని అయిపోయిందని.. దేశంలో ప్రతిపక్ష పార్టీ స్థానాన్ని తామే భర్తీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ..వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల గురించి కీలక విషయాలను అమిత్ షా కు వివరించినట్లు కే ఏ పాల్ మీడియాకు తెలిపారు.