నేడు నల్గొండలో పర్యటించనున్న కేటీఆర్.. షెడ్యూల్ ఇదే..

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా.. మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌ తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మించనున్న ఇనెటెక్‌ వెల్‌కు పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 9.45 గంటలకు పెద్దవూర మండలం సుంకిశాలకు చేరుకుంటారు మంత్రి కేటీఆర్ . హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ఇన్‌టెక్‌ వెల్‌ పంపింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.

KTR questions Modi over discrimination towards Telangana in sanctioning of  medical colleges

ఉదయం 10.45 గంటలకు నందికొండ మున్సిపాలిటీకి చేరుకుని బుద్ధావనం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంభందించిన రూ.56 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌ బయలుదేరుతారు.