రివర్స్ వ్యవహారం: నరసరావు పేటలో ఏమి జరుగుతుంది గోపిరెడ్డి!

-

గతకొన్ని రోజులుగా గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలో జరుగుతున్న రాజకీయాలు తెలుగు దేశం నేతలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు! ఇప్పటికే అన్ని రకాలుగా దెబ్బ మీద దెబ్బ తింటున్న టీడీపీకి తాజాగా నరసరావు పేట వైకాపా కార్యకర్తలు బూస్ట్ ఇచ్చినంత పనిచేశారు.


వివారాళ్లోకి వెళ్తే.. ఇటీవల గుంటూరు జిల్లాలో వరుసగా వైసీపీ కార్యకర్తలు టిడిపిలోకి రావడం సంచలనంగా మారిందనే చెప్పాలి. తాజాగా 30 కుటుంబాలకి చెందిన వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. నరసరావుపేట పట్టణంలోని వైకాపా పార్టీ నుండి 30 కుటుంబాల వారు నరసరావుపేట టీడీపీ ఇన్ ఛార్జ్ డా. చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఫలితంగా వైకాపా ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డికి షాక్ ఇచ్చారు.

ఎన్నికలయ్యి కేవలం ఏడాది మాత్రమే అయ్యింది. ఈ సమయంలో టీడీపీ నుంచి అధికార వైసీపీలో వలసలు ఉండాల్సింది పోయి… రివర్స్ లో తెలుగుదేశం పార్టీలోకి వైకాపా వలసలు రావడం నిజంగా వైకాపాకు షాక్ అనే చెప్పాలి. ఈ సందర్భంగా మైకందుకున్న డా. చదలవాడ… పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని.. ఏడీది లోనే వైకాపాలో నియంత పాలన చూసి విసిగిపోయారని.. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి లంచాలు ఇవ్వలేక జనం ఇబ్బందులు పడుతున్నారని.. ఫలితంగా టీడీపీని ఆశ్రయిస్తున్నారని చెప్పుకొచ్చారు!

దీంతో నరసరావు పేటలో ఏమి జరుగుతుంది గోపిరెడ్డి… అంటూ ఆన్ లైన్ వేదికగా వైకాపా శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. దీని పూర్తిగా ప్రభుత్వంపై వ్యతిరేకతగా చూడాలా లేక స్థానిక పరిస్థితుల ప్రభావం.. గోపిరెడ్డి పనితీరు వంటి విషయాలతో ముడిపెట్టి మాత్రమే చూడాలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న!

Read more RELATED
Recommended to you

Latest news