కాపు ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మనస్థాపం చెంది కీలక నిర్ణయం తీసుకున్నారు. కాపు, బీసీ రిజర్వేషన్ ఉద్యమం నుంచి తప్పుకోవాలని అయన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక వేదనను తెలియజేస్తూ కాపు సోదరులకు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.

గత కొంతకాలంగా ఆయనపై సోషల్ మీడియాలో కొంతమంది అవమానకరమైన పోస్టులు చేస్తున్నారని.. అతనిపై దృష్ప్రచారం చేస్తున్న నేతలే బీసీ రిజర్వేషన్ సాధించాలని అయన లేఖలో పేర్కొన్నారు. ఎంతో కాలంగా అతను నిజాయితీగా రిజర్వేషన్ కోసం ఉద్యమం చేస్తున్నట్టు.. దానికి మద్దతు ఇవ్వకపోగా విమర్శలు చేస్తున్నారని అతను లేఖలో పేర్కొన్నారు.