విశాఖలో లీక్ అయిన గ్యాస్ విష వాయువు స్టీరిన్ కాదా…? అంటే అవుననే సమాదానం వినపడుతుంది. స్టీరిన్ వాయువు అయితే పరిస్థితి తీవ్రత ఈ స్థాయిలో ఉండే అవకాశం ఉండదు అని దాని వలన ప్రాణాలు పోయే విధంగా ఉంటే కేవలం 12 మంది మాత్రమే చనిపోయే అవకాశం ఉండదు అని గాలీ అందరూ పీల్చారు కాబట్టి మరణాలు ఎక్కువగా ఉండాలని అంటున్నారు. మరణాల సంఖ్య తక్కువ గా ఉంది. కాని మరణించిన వారిలో కొందరికి రక్తం బయటకు వచ్చింది. అంటే ఆ వాయువు తో పాటు మరొకటి కలిసిందా…?
మరొకటి కలిసింది కాబట్టే తక్కువ పరిధిలో ప్రభావం చూపించింది అని, ఆ ప్రాంతంలో కొంత మంది మీద మాత్రమే దాని ప్రభావం ఉంది అని అందుకే మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, చనిపోయిన వాళ్ళు పీల్చిన వాయువు చాలా తక్కువగా ఉందని, కాని స్టీరిన్ మాత్రం ఆ ప్రాంతం మొత్తం విస్తరించింది అని అంటున్నారు. స్టీరిన్ తో తల నొప్పి రావడం, కడుపులో మంట రావడం వంటివి ఉంటాయి గాని మరణాలు సంభవించే అంత సీన్ ఉండదు అని దానికి అంత ప్రభావం లేదని పేర్కొంటున్నారు. నిపుణులు చాలా మంది,
అసలు లీక్ అయింది స్టీరిన్ కాదని అభిప్రాయపడుతున్నారు. స్టీరిన్ వలన మరణం సంభవించే అంత సీన్ లేదని వ్యాఖ్యానిస్తున్నారు. స్టీరిన్ బయటకు రావాలి అంటే కచ్చితంగా ఉష్ణోగ్రత 130 డిగ్రీల వరకు ఉండాలని అంటున్నారు. అలా అయితేనే అది బయటకు వస్తుంది గాని, విశాఖలో అంత ఉష్ణోగ్రత బయటకు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. స్టీరిన్ అనే మాట అబద్దం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.