రాష్ట్రంలో ఏం జరిగినా బీజేపీకి ఆపాదించడం సరికాదు – పురందేశ్వరి

-

ఏలూరు: రాబోయే ఎన్నికలలో పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులు అనేవి ఎన్నికలకు నెల ముందు నిర్మించబడతాయని.. ఆ విషయాన్ని కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ లో బిజెపి తో పొత్తులో ఉన్నాను అని చెప్పారని.. మేము జనసేనతో పొత్తులో ఉన్నామన్నారు.

పవన్ కళ్యాణ్ టిడిపీతో వెళ్ళాలి అనే విషయం కేంద్రంతో చర్చిస్తా అన్నారు. ఆ విషయం పార్టీ పెద్దలు చూసుకుంటారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఏం జరిగినా బీజేపీ కి ఆపాదించడం సరికాదన్నారు పురందేశ్వరి. టిడిపి అధినేత నారా చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సమర్థనీయం కాదన్నారు. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

చీప్ లిక్కర్ ద్వారా డబ్బు సంపాదించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సమంజసం కాదని దుయ్యబట్టారు. చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలి అనే ఆలోచన బిజెపి ప్రభుత్వం చేస్తుందన్నారు. సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లు తమదే అంటున్నారని.. కానీ ఆ బిల్లును అమలు చేయడానికి బిజెపి కృషి చేస్తుందన్నారు. పేదలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను మోడీ ప్రభుత్వం చేపడుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news