టీడీపీ- జనసేన-భాజపా కూటమి అధికారంలోకి రాగానే పోలీసు నియామకాలు చేపడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తాడేపల్లిలో ఫైన్ ఉడ్ అపార్టుమెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. “ఐదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. వాళ్లు గొడవలు సృష్టిస్తారు.. ఓర్పు, సహనంతో అందరూ ఓటు వేయాలి.
మీ ఓటును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఎందుకంటే జగన్ ను మించిన దొంగ లేరు. సొంత బాబాయ్ ని చంపి ఆ నింద మాపై వేశారు. ఐదు సంవత్సరాల తర్వాత నిజం బయటకు వచ్చింది. తెదేపా హయాంలో మంగళగిరి ఆటోనగర్ లో ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. సుమారు 2 వేల మంది వీటిలో ఉపాధి పొందుతున్నారు. అధికారంలోకి వచ్చాక మరింత అభివృద్ధి చేస్తాం. స్వర్ణకారుల కోసం సెజ్ ఏర్పాటు చేస్తాం” అని నారా లోకేశ్ అన్నారు.