సీఎం విశాఖ వచ్చి కూర్చుంటానంటే ఎవరు అభ్యంతరం చెప్పరు : GVL నరసింహ రావు

-

సీఎం వైఎస్ జగన్ విశాఖ వచ్చి కూర్చుంటానంటే ఎవరు అభ్యంతరం చెప్పరు అని బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విశాఖలో రాజధానిగా డిక్లేర్ చేసే అవకాశం, అధికారం ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని అంశమం కోర్టు పరిధిలో ఉందన్నారు. అభివృద్ధి అవకాశాలు ఉన్నా వెనుకబడిన ప్రాంతమం శ్రీకాకుళం అన్నారు. వేల సంఖ్యలో మత్స్యకారులు వలసలు ఉన్నాయని తెలిపారు. వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము చేస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రంగాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నామని బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు పొలిటికల్ పార్టీలే కారణమని ఆరోపించారు. బిజెపి నుంచి యాక్షన్ ఉత్తరాంధ్ర అనే ప్రణాళికను చూస్తారు. విశాఖపట్నం కేంద్రంగా గ్రోత్ హబ్ గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన 27 కులాలను బీసీ జాబితా నుంచి తెలంగాణలో తొలగించారని పేర్కొన్నారు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయామని తెలిపారు త్వరలోనే మంచి ఫలితములు లభిస్తుందని జివిఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news