రేపు ఏపీలో వైన్ షాప్స్ బంద్

-

మరికొన్ని గంటల్లో ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోనని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే పోలింగ్ సమయంలో ఏపీలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ సమయంలో అలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ నెల 4న మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఎక్సైజ్‌ శాఖను ఆదేశించింది. ఆ రోజు ‘డ్రై డే’గా పరిగణించాలని సూచించింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఈసీ నిషేదం విధించింది. అయితే స్థానిక పరిస్థితులు, శాంతి భద్రతల రీత్యా పలు జిల్లాల్లో 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాల మూసివేతకు అక్కడి కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. జూన్‌ 3, 4, 5 తేదీల్లో వరుసగా మూడు రోజులు మద్యం దుకాణాలు తెరుచుకోవని తెలియడంతో మందుబాబులు షాపుల వద్ద క్యూ కట్టారు. ముందుగానే తమ ఇళ్లలో కొద్ది పాటి స్టాక్‌ పెట్టుకోవడానికి వైన్‌ షాప్‌ల వద్ద ఎగబడ్డారు. తిరిగి మళ్లీ ఆరో తేదీ ఉదయం వైన్‌ షాపులు తెరుచుకుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news