ఏపీలో రేపటి నుంచి వైన్ షాపులు బంద్ కానున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. కొత్త పాలసీతో తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు వైన్స్ లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.
తమ ఉద్యోగాల విషయంలో చంద్రబాబు పునరాలోచించాలంటున్నారు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. దింతో ఏపీలో రేపటి నుంచి వైన్ షాపులు బంద్ కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి… కొత్త పాలసీని అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం కనిపించడం లేదని సమాచారం. మళ్లీ పాత పద్ధతిలోనే మద్యం దుకాణాలను చంద్రబాబు సర్కార్ నడపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అలా నడిపితే… ప్రస్తుతం మద్యం దుకాణాలలో పనిచేస్తున్న సూపర్వైజర్లు అలాగే సేల్స్ మాన్ల ఉద్యోగాలకు భద్రత ఉంటుంది. దీంతో తమ బంద్ ప్రకటనను వెనక్కి ఉద్యోగులు తీసుకుంటారని చంద్రబాబు సర్కార్ ఆలోచన చేస్తోంది.