మొత్తం వ్యవస్థలనే దోచేసిన వ్యక్తి లంచాలు తీసుకోవడం నేరమని జగన్ మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని యనమల సెటైర్ వేశారు. జగన్ సామాజిక న్యాయం మాటలకే తప్ప ఆచరణలో శూన్యమని మండిపడ్డారు. జగన్ తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నారు…ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దోచుకుంటున్నారాన్నరు.
దోచుకున్న డబ్బంతా జగన్ ఎక్కడ దాచుకున్నారో చెప్పాలి…క్విడ్ ప్రోకో కేసుల్లో 14 ఛార్జ్ షీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి లంచాలు గురించి ఏం మాట్లాడటం విడ్డూరంగా ఉందని చురకలు అంటించారు. అధికారులు లంచాలు తీసుకోవడం తప్పైతే జగన్ క్విడ్ ప్రోకోతో దోచుకోవడం నేరం కాదా?జగన్ సామాజిక న్యాయం మాటలకే పరిమితమైపోయిందని విమర్శలు చేశారు.
ఆచరణలో ఏ ఒక్క సామాజిక వర్గానికి జగన్ న్యాయం చేయలేకపోయారు…జగన్ మూడేళ్లలో విద్యారంగం పతనావస్థకు చేరుకుందని ఆగ్రహించారు. బలహీన వర్గాలకు విద్యనందిచడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది…అమ్మఒడి సరిగా ఇవ్వకపోవడంతో కాలేజీల్లో విద్యార్ధులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. జగన్, వైసీపీ నాయకుల ఆదాయలు పెరుగుతున్నాయి కానీ ప్రజల ఆదాయాలను పూర్తిగా పడిపోయాయి.జగన్ చేసిన సామాజిక న్యాయం ఇదేనా? అని ప్రశ్నించారు.