హైదరాబాద్ లో పబ్ లు అక్రమాలకు అడ్డాగా మారాయి. డ్రగ్స్, లైంగిక వేధింపుల ఇలా నేరాలకు పాల్పడటంతో కీలక పాత్ర వహిస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పార్టీ పేరుతో పబ్ కు పిలిచి మైనర్ బాలికపై లైంగిక దాడికి తెగబడ్డారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అమ్నేషియా పబ్ లో ఈ దారుణం జరిగింది. సూరజ్, హాడీ అనే వ్యక్తులు బాలికను పార్టీకి పిలవడంతో మధ్యాహ్నం పబ్ కు వెళ్లింది. కాగా బాలికలో పాటు మరో ఆరుగురు మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి స్పృహ కోల్పోయిన తర్వాత బాలికపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన గత నెల 28న జరిగినట్లు తెలుస్తోంది.
పబ్ లో పార్టీ పేరుతో 16 ఏళ్ల మైనర్ అమ్మాయిని పిలవడంతో ఆమె పార్టీకి వెళ్లింది. ఆ తరువాత బలవంతంగా వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. రెండు బీఎండబ్ల్యూ కార్లలో మైనర్ అమ్మాయిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ అంశంపై విచారణ సాగిస్తున్నారు.