అరెస్ట్ తప్పదని.. క్యాడర్‌ను సిద్ధం చేస్తున్న అవినాష్ రెడ్డి !

-

అరెస్ట్ తప్పదని.. క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఇందులో భాగంగానే.. ఇవాళ్టి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇక నిన్న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ముగిసిన అనంతరం…అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపి స్థాయి వ్యక్తికే నిజాయితీ నిరూపించుకోవడాని చాలా కష్టపడాల్సి వస్తోందని..ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.

సునీతమ్మ స్టేట్మెంట్ లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని.. మొదట సునీతమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ లో మా ప్రస్తావనే లేదని వివరించారు. మొదట లెటర్ దాచిన విషయంలో కూడా మా కుటుంబానికి సంబంధం లేదు అన్నారని.. అయితే ఇప్పుడు సునీతక్క పూర్తిగా మాట మార్చిందని పేర్కొన్నారు. సునీతక్క భర్త రాజశేఖరరెడ్డి ఫోన్ చేస్తేనే నేను అక్కడికి వెళ్ళానని..ఫోన్ రావడం ఒక 15 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే ఈ రోజు నామీద నిందలు ఉండేవి కావని వెల్లడించారు. నన్ను కేసులో ఇరికించడానికి కుట్ర జరుగుతోందని.. నాకు నాన్నకు, శంకర్ రెడ్డి అన్నకు ఎలాంటి సంబంధం లేదు. వివేకా సార్ ను హత్య చేయబోమే ముందు దస్తగిరి వాల్లు రాయించిన లేఖను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఆనాడే వాల్లు చంపి డ్రైవర్ ప్రసాద్ ను ఇరికించాలని చూశారని చెప్పారు వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news