వారిపై పెంపుడు కుక్కల్ని వదలండంటూ కొడాలి నాని అనుచరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు డబ్బు పంచకుండా కొందరు కాజేశారంటూ గుడివాడ సీనియర్ వైసిపి మైనార్టీ నేత సర్దార్ బేగ్ ఆరోపణలు చేశారు. డబ్బు కాజెసిన వారిపై పెంపుడు కుక్కలు వదలాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనార్టీ వార్డుల్లో గుడివాడ ఎమ్మెల్యే… వైకాపా అభ్యర్థి కొడాలి నాని పెంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మైనార్టీ నేత సర్దార్ బేగ్.
నాని ఇచ్చిన డబ్బును కొందరు ఓటర్లకు పంచకుండా తమ వద్దే ఉంచుకొని జల్సాలు చేయడానికి, విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రమించారు. ఆ డబ్బులు కాజేసిన వారందరినీ కల్యాణమండపానికి పిలిచి నిలదీయండి అని కొడాలి నాని తమ్ముడిని కోరారు. నిజం చెప్పిన వారిని వదిలేసి డబ్బు వసూలు చేయండి….ఇవ్వని వారిపైకి మీ పెంపుడు కుక్కలన్నింటినీ వదిలేయండి అంటూ హెచ్చరించారు. నమ్మక ద్రోహం చేసిన వారిలో 10, 11, 12(మైనార్టీ)వార్డుల్లోని వారున్నారన్నారు. చిన్ని అన్నా.. మీరు వేగంగా వారిని పిలిచి డబ్బులు వసూలు చేయండి. లేదంటే ఒకరు గోవా, మరొకరు సింగపూర్, మలేషియా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్నారు.