AP ASSEMBLY: శాసన మండలి నుండి వైసీపీ సభ్యుల వాకౌట్

-

AP ASSEMBLY: వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. శాసన మండలి నుండి వైసిపి సభ్యులు వాకౌట్ చేశారు. విజయనగరం జిల్లా గుర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన డయేరియా మరణాలపై పశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎన్ని మరణాలు జరిగాయి, చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు వైసిపి సభ్యులు.

botsa

గతంలో నేను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనంతగా డయేరియా ప్రబలిందన్న బొత్స సత్యనారాయణ … గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కంటే ఐదు నెలల కాలంలో ఎందుకు త్రాగు నీటి వ్యవస్థలను మెయింటెన్ చేయలేకపోయారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బొత్స వ్యాఖ్యలకు ప్రతిగా మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్ళలో పంచాయితీలకు నిధులు ఎందుకు ఇవ్వలేదన్నారు అచ్చెన్నాయుడు…. డయేరియా భాదితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలంటూనే నియోజకవర్గంలో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ. ఇక బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయనే చెప్పారన్న మంత్రి సత్య కుమార్… బొత్స ఆవేదన చూస్తుంటే ముచ్చటేస్తుందని చురకలు అంటించారు. ఈ తరుణంలోనే.. శాసన మండలి నుండి వైసిపి సభ్యులు వాకౌట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news