ఏ పార్టీ అవకాశం ఇచ్చినా..కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తానని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గంలో నాకు తోడు ఉన్న కార్యకర్తలకు నేను ఎప్పుడు అండగా ఉంటానన్నారు. కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్నాను….నా కుటుంబ సభ్యులు రాయదుర్గం నుంచి పోటీ చేస్తారని వివరించారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.
ఏ పార్టీ నుంచి అవకాశం ఇచ్చిన నేను పోటీ చేయడానికి రెఢీగా ఉన్నాను…సోషల్ మీడియాలో టికెట్ వస్తుంది అనే అభ్యర్థులు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. నా కార్యకర్తల పైన బెదిరింపు ధోరణితో దుష్ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. కాగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని సమాచారం అందుతోంది.