ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే సాధించింది. కూటమి విజయం సాధించడంతో ఏపీ లో ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా రానట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష దక్కాలంటే వైసీపీకి 23 సీట్లు రావాలి. కానీ 11 సీట్లు మాత్రమే రావడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమించాలి. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా సూర్యదేవర ప్రసన్న కుమార్ పేరిట సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. మరోవైపు శాసనసభలో తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే స్పీకర్ కు లేఖ రాశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎలాంటి ప్రకటించలేదని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.