బ్రేకింగ్ : హైకోర్టు న్యాయమూర్తులపై కామెంట్స్ కేసు సీబీఐకి

-

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టులు అలానే కకొందరు వైసీపీ నేతలు డైరెక్ట్ కామెంట్స్ మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్న సమయంలో ఈ నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆ తరువాత న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వివిధ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు, పోస్టులు పెట్టారు వైసీపీ మద్దతు దారులు.

వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు కొందరు వ్యక్తులపై సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది. అయితే సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసుల్లో పురోగతి లేదని, సామాజిక మాధ్యమ కంపెనీలైన ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని హైకోర్టు తరఫున రిజిస్ట్రార్‌ జనరల్‌ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంపై పిటిషన్‌ దాఖలు చేసారు. దీంతో ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు. సభాపతి తమ్మినేని, మంత్రి కొడాలి నాని, మాజీ ఎం ఎల్ ఏ ఆమంచి సహా పలువురు వైసీపీ నేతల వ్యాఖ్యలను సీబీఐకి ఇచ్చింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version